సీతానగరం: 'మహిళలు గుర్తు తెలియని వ్యక్తులు బైక్స్‌పై ప్రయాణించరాదు'

ఆదివారం సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో, గుర్తు తెలియని వ్యక్తుల బైక్‌లపై మహిళలు ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను బైక్‌పై ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రదేశాలలో వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ప్రచారం సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో ఆటోలో మైక్ ద్వారా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్