సంక్రాంతికి మన్యం నుంచి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండగ సందర్భంగా సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. డీపీటీవో వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, రెగ్యులర్ సర్వీసులతో పాటు విశాఖ వరకు అదనపు బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాలూరు నుంచి 4, పార్వతీపురం నుంచి 8, పాలకొండ డిపో నుంచి 10 ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి. పాలకొండ నుంచి విజయవాడకు రెండు బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ సేవలు శుక్రవారం నుంచే ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్