ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం సాధించిన టీచర్

ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి గ్రూపు-2 ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో గజపతినగరం మండలం వేమలికి చెందిన కోప్పల లక్ష్మణరావు ఎక్సైజ్ ఎస్ఐగా ఉద్యోగం సాధించారు. లక్ష్మణరావు ఇటీవల మెగా డీఎస్సీలో 3 టీచర్ పోస్టులు సాధించగా ప్రస్తుతం పులిగెడ్డ గురుకుల పాఠశాలలో PGT గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఎక్సైజ్ ఎస్ఐగా ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్