పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం, ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షప్రధానకార్యదర్శులు బి. నరసింగరావు, చింతాడ రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించేలా చట్ట సవరణ చేయాలని వారు కోరారు. ఉపాధ్యాయుల సుదీర్ఘ సేవలు, అనుభవాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.