సీతానగరం మండలం సూరంపేట గ్రామంలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా బుధవారం మండల వ్యవసాయ అధికారి యస్ అవినాష్ రైతులతో కలసి మేడిశెట్టి వెంకటేశ్వరరావు పొలంలో తాడు ఉడుపు పద్దతిని అవగాహన కల్పించారు. సుమారు 8 ఎకరాల వరకు వరుస క్రమంలో వారినట్లు వేయించటం జరిగింది. మండల వ్యవసాయ అధికారి రైతులతో మాటాడుతు తూర్పు పడమర దిశగా తాడు ఉడుపు వేయటం వలన పైరుకి గాలి వెలుతురు బాగా తగిలి చీడపీడలు ఉదృతి తగ్గుతుంది అని అన్నారు.