సీతానగరం మండలం చెల్లంనాయుడు వలసలో వేల కిలోమీటర్ల దూరం నుంచి 'ఆసియా ఓపెన్‌బిల్ కొంగలు' రాకతో విదేశీ పక్షుల సందడి మొదలైంది. ప్రతీ ఏటా జూన్ నెలలో వచ్చే ఈ పక్షులు కొన్ని నెలలు ఇక్కడ ఉండి, సంతానోత్పత్తి తర్వాత తిరిగి వెళ్లిపోతాయి. పుష్కలంగా ఆహారం, గూళ్లు కట్టేందుకు అనువైన ప్రదేశం ఉండటమే ఇందుకు కారణం. ఈ అరుదైన పక్షుల రాకతో వర్షాకాలం ప్రారంభమవుతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు.