ఆటో బోల్తా పడి ఉపాధి హామీ కూలీ మృతిచెందాడు. ఈ సంఘటన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం. గడగమ్మ గ్రామానికి చెందిన అరసాడ ప్రసాద్ (49)చినగొరకాలనీ సమీపంలోని ఆరుద్రమ్మ చెరువులు ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని తోటి కూలీలతో కలిసి ఆటోలో తిరిగి వస్తుండగా అచ్చపువలస గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడడంతో మృతి చెందాడు. పట్రా సంతోషమ్మకు గాయాలయ్యాయి.