శనివారం మండల వ్యాప్తంగా ఎస్ఐ షణ్ముఖరావు చైన్ స్నాచింగ్‌పై ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాలకు వెళ్లే వృద్ధులు, ఒంటరి మహిళలే లక్ష్యంగా హెల్మెట్ ధరించిన వ్యక్తి బైక్‌పై వచ్చి బంగారు గొలుసులు తెంపుకుపోతున్నాడని ఆయన తెలిపారు. పండుగ సీజన్లో క్యాంపులకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.