పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వంగర మండలంలో సోమవారం రాత్రి 10 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నాటికి వాయుగుండం తీవ్ర రూపం దాల్చనుందని, మరో రెండు రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎండిపోయిన వరి పంటలకు జీవం పోయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో 9676424800, 9501208976, 9550747512 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.