అభివృద్ధిని ఓర్వలేక రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్న జగన్

వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. శనివారం రాజాంలో టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంటే జగన్ ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వైసిపి హయాంలో కడప స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని, కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్