రాజాం మండలం ఒమ్మి గ్రామం నుంచి శ్రీకాకుళానికి మామిడి పళ్లు తీసుకెళ్తున్న ఆటో తెల్లవారుజామున బొబ్బిలి సెంటర్‌లో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఒమ్మి గ్రామానికి చెందిన పడాల సూర్యవంశీ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సూర్యవంశీని రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు.