రాజాం: సీఐను మర్యాదపూర్వకంగా కలిసిన డివిఎంసి సభ్యుడు మజ్జి

విజయనగరం జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యునిగా నియామకమైన మజ్జి గణపతిని రాజాం రూరల్ సీఐ హెచ్ ఉపేంద్రరావు అభినందించారు. శనివారం వంగరలోని సీఐని గణపతి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీసు సేవలు అందిస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్