ఇసుక లోడింగ్ కోసం రేగిడి వెళుతున్న ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి ఆదివారం ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది. గమనించిన తోటి డ్రైవర్లు ఘటనస్థలికి చేరుకుని డ్రైవర్ను లారీ క్యాబిన్ నుండి బయటకు తీశారు. అప్పటికే డ్రైవర్ మృతి చెందడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు అనకాపల్లి కి చెందిన నాగరాజు గా గుర్తించారు.