రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అమరావతిలో వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల అభివృద్ధి శాఖామంత్రి నిమ్మల రామానాయుడుతో శుక్రవారం భేటీ అయ్యారు. నియోజకవర్గం సమస్యలను వివరించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను ముఖ్య మంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టి పరిష్కారం చూపిస్తామని మంత్రి రామానాయుడు తెలిపారన్నారు.