మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం తర్లి గ్రామంలో శనివారం నాడు డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో సాఖీహబ్ మహిళా అవగాహన కార్యక్రమం జరిగింది. మండల కోఆర్డినేటర్ కుజ్జి రాణి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మహిళలకు ఋతుస్రావం సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటి నివారణ మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలకు అవసరమైన కొన్ని వస్తువులను ఉచితంగా అందజేశారు. తర్లి మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్