పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల మహిళ మృతి చెందారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో బిక్షమెత్తుకొని జీవనం సాగిస్తున్న ఆమె, గాంధీ నగర్ జంక్షన్‌లో వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.