గరుగుబిల్లి మండలం ఖడ్గవలస మిల్లు ముందు టర్నింగ్‌లో ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన వంశీ (24) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈనెల 17న బంధువుల ఇంటికి వచ్చి, తోటపల్లి దర్శనం చేసుకుని వస్తుండగా బైక్ అతివేగంతో తుప్పల్లోకి దూసుకుపోయి ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.