పార్వతీపురం మండలంలోని చినబొండపల్లి గ్రామంలో కైకాలవీధి సమీపంలో సీసీ రోడ్డుకు ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చేతికందే ఎత్తులో ప్రమాదకరంగా ఉంది. ఎలాంటి రక్షణ వలయం, గోడ లేకుండా ఏర్పాటు చేయడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలు అటుగా మేతకు వెళ్లేటప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.