సాలూరు మండలంలోని ఖరాసవలసలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సాలూరు రూరల్ ఎస్‌ఐ పి. నర్సింహమూర్తి శనివారం విలేకరులకు తెలిపారు. ఖరాసవలస గ్రామానికి చెందిన ఇల్లాపుదొర ఖరాసమ్మ(39) ను గత కొంత కాలంగా భర్త శ్రీను మద్యం తాగి ఇంటికి వచ్చి వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన భార్య అస్వస్థతకు గురయ్యిందంటూ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారని అన్నారు.