సాలూరు: ఘాట్ రోడ్డులో లోయలో పడిన లారీ

పాచిపెంట మండలం పీ. కోనవలస ఘాట్ రోడ్డులో సుమారు 200 అడుగులు లోయలో లారీ బోల్తా పడిందని ఎస్సై వెంకట సురేష్ గురువారం తెలిపారు. రెండు క్రేన్లు సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒడిశా నుంచి ఏపీకి గోధుమలు లోడుతో వస్తున్న లారీ ఘాట్ రోడ్డులో మలుపు దగ్గర అదుపుతప్పి లోయలో పడిపోయింది. కాగా ప్రమాదం ముందే గ్రహించిన డ్రైవర్, క్లీనర్ కిందకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారని ఎస్సై వెల్లడించారు.

సంబంధిత పోస్ట్