సాలూరు ఆదిపరాశక్తి ఆలయ ధర్మకర్త మృతి

సాలూరులోని శ్రీ ఆదిపరాశక్తి ఆలయ ధర్మకర్త, ప్రధానార్చకుడు ఆనందరావు బుధవారం గుండెపోటుతో మరణించారు. గత 30 ఏళ్లుగా సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రపురం మండలాల్లోని అనేకమంది భవానీ స్వాములకు మాలలు వేస్తూ గురువుగా సేవలందించిన ఆయన మరణంతో భక్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆలయ అభివృద్ధికి పాటుపడిన గురువును కోల్పోయామని భక్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్