వేపాడ మండలంలో తప్పిన ప్రమాదం

వేపాడ మండలంలో గురువారం ప్రమాదం తప్పింది. వేపాడ నుండి గడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆకుల సీతంపేట గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో వల్లంపూడి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి ట్రాఫిక్ పునరుద్ధరణ చేశారు.

సంబంధిత పోస్ట్