మూడు రోజుల నుండి జామి మండలంలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు అన్నంరాజుపేట, ఎం కొత్తవలస తదితర గ్రామాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ మేరకు అపరాల పంటలైన మినుము, పెసర పంటలు పూర్తిగా నీట మునిగాయి. మొక్కజొన్న మొలకలు సైతం నీట మునగడం తో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. కాగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు నీట మునిగిన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తున్నారు.