జామి: విద్యుత్ షాక్ కు గురై జూనియర్ లైన్మెన్ మృతి

విద్యుత్ షాక్ కు గురై జూనియర్ లైన్మెన్ మృతి చెందిన సంఘటన జామి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. శాసనాపల్లి సచివాలయంలో జూనియర్ లైన్మెన్ గా పనిచేస్తున్న రెహమాన్ శుక్రవారం సోమయాజులపాలెం లో విద్యుత్ స్తంభం పై పనిచేస్తుండగా కరెంటు షాక్ తగిలి కింద పడిపోయాడు. స్థానికులు గమనించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రెహమాన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంబంధిత పోస్ట్