జామి: 'పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. జామి మండలం రామభద్రపురంలో సోమవారం జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కూటమితోనే సాధ్యమన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా కల్పించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్