కొత్తవలస పంచాయతీ పరిధిలోని రాజన్న కాలనీలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. సోమవారం ఎస్. కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో 180వ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్త డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసన, పొగ వస్తోందని, తద్వారా కాలనీవాసులు అనారోగ్యం బారిన పడుతూ అవస్థలు పడుతున్నారని వారు మండిపడ్డారు. అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.