కొత్తవలస మండలం గొల్లలపాలెంకు చెందిన ఎస్ వినయ్ కుమార్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈయన ఎస్కోట పిహెచ్సిలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో బలిఘట్టం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎస్ కోట పిహెచ్సికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.