మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం కొత్తవలస మండలం మంగళ పాలెం రానున్నట్లు కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ శుక్రవారం తెలిపారు. వెంకయ్య నాయుడు విశాఖలో ఉదయం 8 గంటల 20 నిమిషాలకి బయలుదేరి 10 గంటలకు కొత్తవలస చేరుకుంటారని అన్నారు. అనంతరం 10 గంటల 20 నిమిషాలకు మంగళ పాలెం లోని శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ లో నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి తిరిగి విశాఖకు వెళ్తారని పేర్కొన్నారు.