కొత్తవలస విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని 11 కె. వి లైన్లో మరమ్మత్తులు చేపట్టనున్న నేపథ్యంలో మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈ ఈ సురేష్ బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. చింతల పాలెం, మంగళ పాలెం, దేశపాత్రునిపాలెం, సీరంశెట్టిపాలెం, తాడివానిపాలెం, వసంత విహార్, 202 కాలనీ, రెల్లి కాలనీ, గొల్లపేట ప్రాంతాల్లో శనివారం ఉదయం 9 నుండి 11 వరకు కరెంటు సరఫరా ఉండదని తెలిపారు.