పాటూరు శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో పరివర్తిని ఏకాదశి

విజయనగరం జిల్లా వేపాడ మండలం పాటూరు గ్రామంలో వేంచేసియున్న 820 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో మంగళవారం పరివర్తిని ఏకాదశి సందర్భంగా శ్రీ జనార్ధన స్వామివారికి పంచామృత అభిషేకం అలంకరణన పిమ్మట పూజలు నిర్వహించడం జరిగింది. తుఫాన్ ప్రభావంతో రాత్రి నుండి వర్షం కురుస్తుంది. అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమంలో భక్తిశ్రద్దలతో పాల్గొన్నారు. సాయంత్రం వర్షం సహకరిస్తే స్వామివారి ఉరేగింపు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు పి. వి. యెస్. ప్రసాదాచార్యులు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్

✕
✕