ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకానికి ఆర్టీసీ సిబ్బంది తూట్లు పొడుస్తున్నారు. బస్సుల కోసం వేచి చూస్తున్నా మహిళలను చూసి కనీసం బస్టాప్ లో బస్సులు కూడా ఆపకుండా వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఆపిన మహిళలు బస్సును ఎక్కకుండానే బస్సును ముందుకు పోనిస్తున్నారు. ఒకవేళ బస్సు ఆపిన మహిళలు పూర్తిగా బస్సు ఎక్కకుండానే ముందుకు పోనిస్తున్నారు. దీని కారణంగా ఇటీవల కొత్తవలస బస్ స్టాప్ లో చాలామంది మహిళలు బస్సు ఎక్కలేక కిందపడి గాయపడ్డ సంఘటనలు చాలానే ఉన్నాయి. ఎస్. కోట-విశాఖపట్నం మధ్య నడిచే పల్లె వెలుగు బస్సు డ్రైవర్లు మహిళలతో మరీ ఘోరంగా మహిళలను దుర్భాషలాడుతున్నారని సమాచారం.