ఉద్యోగం ఇప్పిస్తాడని వాట్సాప్ లో చాట్ చేసి ఓ మహిళ డబ్బులు పోగొట్టుకున్న ఘటన ఎస్ కోట మండలంలో బుధవారం చోటుచేసుకుంది. సిఐ నారాయణమూర్తి వివరాలు ప్రకారం, ఎస్ కోటకు చెందిన ఓ మహిళ తనకు ఉద్యోగం ఇస్తాడని వాట్సాప్ లో ఓ వ్యక్తితో చాట్ చేసింది. ఈ క్రమంలో ఆమె అతడిని నమ్మి రూ. 4,17,000 ఇచ్చేసింది. డబ్బులు చెల్లించాక ఆ వ్యక్తి నుండి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.