జామి మండలం అలమండ-కంటకాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు జి.అర్.పి ఎస్ ఐ బాలాజీ రావు మంగళవారం తెలిపారు. మృతురాలు ఆకుపచ్చ రంగు చీర, నలుపు జాకెట్టు ధరించిందని, ఆమె ఎడమ మోచేతిపై పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాలు తెలిసినవారు 9490617089, 0891 -2883218 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.