ఎస్ కోట: తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

ఎస్ కోట నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో కోరారు. వేపాడ మండలం బొద్దాం హైస్కూల్లో సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద చదవాల్సిన పరిస్థితి నెలకొంది అని ఆమె అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పథకం కింద మంజూరైన నిధులను అప్పటి పాలకులు పక్కదారి పట్టించారని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్