ఎస్ కోట మండలం చామలాపల్లిలో బుధవారం రాత్రి ప్రసాద్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన మురళి కత్తితో దాడి చేసి హత్య చేయడం తెలిసిందే. అప్పటినుండి పరారిలో ఉన్న మురళి శుక్రవారం తన బైక్ పై ఎస్ కోట మండలం ధర్మవరం వైపు వెళుతున్న క్రమంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, బైకును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు.