వేపాడ: చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి

వేపాడ మండలం వీలుపర్తి కి చెందిన గోకేడ శ్రీదేవి (38) అనారోగ్య కారణాలతో పురుగులు మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వైద్య చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై బి దేవి ఆదివారం తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్