యాక్సెంచర్ సీఎస్‌ఆర్ నిధులతో సౌర విద్యుత్ లో నైపుణ్య శిక్షణ

విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో యాక్సెంచర్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో, ఖవిష్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల సౌర విద్యుత్ నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సోలార్ ప్యానెల్ మాడ్యూల్ తయారీ, సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌పై ప్రాక్టికల్, సాంకేతిక శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి జాతీయ వృత్తి విద్య మరియు శిక్షణ మండలి (ఎన్‌సీవీఈటీ) ధ్రువపత్రం అందజేయనున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సత్యనారాయణ, టీ. పీ. ఓ. దిల్లేశ్వరరావు కార్యక్రమాన్ని అభినందించారు. లెక్చరర్ డాక్టర్ సంతోష్ బాబ్జీ, ట్రైనర్స్ అజయ్, లక్ష్మీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్