ఈ నెల 26న మాజీ ఉప రాష్ట్రపతి జిల్లాకు రాక

మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ నెల 26న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న సాయంత్రం విశాఖ నుంచి విజయనగరం కోరుకొండ రోడ్డులోని రామ నారాయణం వద్దకు చేరుకుంటారని 4:30 గంటలకు రామ నారాయణంలో వాల్మీకి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం కోరుకొండ సైనిక్ స్కూల్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారని 27న ఉదయం భువనేశ్వర్ కు వెళ్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్