భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. గతంలో జులై 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని వార్తలు వెలువడ్డాయి. అందుకు అనుగుణంగా అధికారులు పనులు వేగవంతం చేసి, ఏవియేషన్ విభాగం ట్రయల్ రన్ కూడా నిర్వహించింది. అయితే, తాజాగా అందిన సమాచారం ప్రకారం, జులై మూడవ వారంలో ప్రధానమంత్రి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ప్రారంభ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.