లారీని ఢీకొన్న బైక్.. ఘటనాస్థలంలోనే వ్యక్తి మృతి

గజపతినగరం మండలం మధుపాడ సమీపంలోని జాతీయ రహదారి-26పై ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి ఎదురుగా ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు బైక్ పూర్తిగా ధ్వంసమవగా, మృతదేహం గుర్తుపట్టలేని స్థితికి చేరిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్