విజయనగరం జిల్లా తోండ్రంగిలో ప్రేమ పేరుతో రామునాయుడు అనే వ్యక్తి చేసిన బ్లాక్‌మెయిల్ కారణంగా అఖిల (22) అనే యువతి గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన కుటుంబ పరువు పోతుందనే భయంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ వార్త తెలిసి భయపడిన రామునాయుడు కూడా విషం తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఇలా మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.