విజయనగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం: కమిషనర్

విజయనగరం నగరంలో గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిఎంఆర్ వద్ద 250 mm పంపింగ్ లైన్‌లో లీక్ కారణంగా బాలాజీ ట్యాంక్ పరిధిలోని 25 వార్డులలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. రైల్వేస్టేషన్ ఏరియా, బాలాజీ నగర్, బ్యాంకు కాలనీ, ఇందిరా నగర్, ప్రదీప్ నగర్, తోటపాలెం, బొచ్చ పేట, నాయుడు కాలనీ, సిద్ధార్థ నగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా, నాగోజీ పేట వంటి ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా పునరుద్ధరిస్తామని కమిషనర్ బాలస్వామి తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్