జీతాల పెంపుదలపై ఉద్యోగుల ఆందోళన, వినతిపత్రం అందజేత

విజయనగరం: గత ఏడు సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ హోదాలలో పనిచేస్తున్న సిబ్బందికి జీతభత్యాలలో ఎటువంటి పెంపుదల లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, తమ జీతాలు పెంచాలని శనివారం ఉద్యోగులు కోరుతున్నారు. ఈ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగ సంఘాలు, తమ న్యాయపరమైన కోరికలను అక్టోబర్ 10లోగా పరిష్కరించాలని కోరుతూ శనివారం ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారికి వినతిపత్రం అందజేశారు. ప్రెసిడెంట్ సతీష్ కుమార్, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕