విజయనగరంలో భారీ వర్షం కురిసింది. బుధవారం మద్యాహ్నం ఆకాశమంతా మేఘావృతంగా మారి ఉరుములతో భారీ వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత నేపథ్యంలో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం ఊరట నిచ్చింది. వాతావరణం ఒక్క సారిగాచల్లబడడంతో ప్రజలు ఈ వర్షంతో కాస్త సేద తీరారు.