జాషువా సాహిత్యం మానవత్వానికి ప్రతీక: లింగాల నరసింగరావు

విజయనగరంలో కవికోకిల గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సోమవారం  నివాళులర్పించారు. విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల నరసింగరావు మాట్లాడుతూ  జాషువా సాహిత్యం మానవత్వమే మహాన్నతమని చాటి చెప్పిందని, కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా సామాజిక చైతన్యాన్ని కలిగించిందని, నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమం మహాకవి గురజాడ అప్పారావు స్వగృహంలో జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕