రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన కొత్తవలసలో చోటుచేసుకుంది. జనార్ధన్ నగర్ కు చెందిన అన్వేష్ (7) శుక్రవారం ఉదయం పాల ప్యాకెట్లు కొనుగోలు చేసే నిమిత్తం వచ్చాడు. అన్వేష్ పాల ప్యాకెట్లు కొనుగోలు చేసుకుని రోడ్డు దాటుతున్న సమయంలో ఓ లారీ బాలుడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో అన్వేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.