శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి 2026-2028 విద్యా సంవత్సరానికి గాను బి.ఎడ్ దూర విద్య కోర్సు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరంలోని డాక్టర్ పి.వి.జి. రాజ సాహెబ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. శ్రీనివాస మోహన్ ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. ఈ అవకాశం కేవలం మహిళా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తుందని, దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31 అని ఆయన తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.