విజయనగరంలో అరుదైన మైక్రో సర్జరీ

విజయనగరంలోని సుఖీభవ ఆసుపత్రిలో బుధవారం వైద్యులు అరుదైన మైక్రో సర్జరీ ద్వారా చిన్నారి ప్రాణాలను కాపాడారు. తీవ్రమైన వాంతులు, తల పరిమాణం పెరుగుతున్న లక్షణాలతో చేరిన బాధితురాలికి, మెదడులో 'మెడుల్లోబ్లాస్టోమా' అనే అరుదైన కణితి ఉన్నట్లు గుర్తించారు. ఎమర్జెన్సీ ప్రాతిపదికన అత్యాధునిక మైక్రోస్కోప్ సాయంతో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. విజయనగరంలో ఇంత చిన్నపిల్లలకు ఇలాంటి సర్జరీ చేయడం ఇదే మొదటిసారని డాక్టర్ పి. ఎస్. వి. రామారావు, డాక్టర్ రెడ్డి శంకర్ రావు తెలిపారు. చిన్నారి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕