విజయనగరం జిల్లా మెంటాడలో రింగ్ రోడ్డు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న మెంటాడ గ్రామానికి చెందిన పాండ్రంకి వెంకటలక్ష్మి అనే మహిళను గుర్తుతెలియని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.