ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పండి.. పర్యావరణాన్ని కాపాడండి

విజయనగరంలోని అయ్యన్నపేట కూడలిలో ఉన్న మున్సిపల్ నడక మైదానంలో శుక్రవారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణమని, అవి భూమిలో, నీటిలో పేరుకుపోయి పర్యావరణ వ్యవస్థలకు, సముద్ర జీవులకు హాని కలిగిస్తాయని తెలిపారు. ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి సంవత్సరాలు పడుతుందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్